Share News

ముస్లింలకు న్యాయం చేయండి

ABN , Publish Date - May 03 , 2025 | 10:28 PM

ముస్లింల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ శాసనమండలి చైర్మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ షరీ్‌ఫను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. మార్కాపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలకు సంబందించిన ఆస్తులను పరిశీలించేందుకు వచ్చిన షరీఫ్‌ను కొద్దిసేపు పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో ఎమ్మెల్యే కందుల మర్యాదపూర్వకంగా కలిశారు.

ముస్లింలకు న్యాయం చేయండి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షరీ్‌ఫతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ప్రభుత్వ సలహాదారు షరీఫ్‌ దృష్టికి

స్థానిక సమస్యలను తీసుకెళ్లిన ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, మే 3 (ఆంధ్రజ్యోతి): ముస్లింల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ శాసనమండలి చైర్మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ షరీ్‌ఫను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. మార్కాపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలకు సంబందించిన ఆస్తులను పరిశీలించేందుకు వచ్చిన షరీఫ్‌ను కొద్దిసేపు పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో ఎమ్మెల్యే కందుల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్ని దశాబ్దాలుగా ముస్లింలకు కలగా మిగిలిన షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంతేకాక మార్కాపురం, పొదిలి పట్టణాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందన్నారు. మార్కాపురంలో ఉన్న ఒక్క ఉర్దూ పాఠశాల వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముస్లింలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కందుల కోరారు. సావధానంగా విన్న షరీఫ్‌ తప్పకుండా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మీర్జా ఆబిద్‌ హుసేన్‌బేగ్‌, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ మౌళాలి, మైనార్టీ నాయకులు మయూరి ఖాశిం, పఠాన్‌ హుసేన్‌ఖాన్‌, సయ్యద్‌ గఫార్‌, రసూల్‌ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 10:28 PM