జిల్లావ్యాప్తంగా తనిఖీలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:41 AM
జిల్లాలోని వివిధ సంస్థల్లో అధికార యంత్రాంగం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. నెలవారీ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు 185 సంస్థల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. రెవెన్యూ, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖల అధికారులు జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలు, హోటల్స్, సినిమా థియేటర్లు, రేషన్ షాపులు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, ఆర్వో ప్లాంట్లు, గ్యాస్ ఏజెన్సీలను విస్తృతంగా తనిఖీ చేశారు.
ఎరువుల దుకాణాలు, రేషన్ షాపులు, పెట్రోలు బంకుల్లో రికార్డుల పరిశీలన
రంగంలోకి రెవెన్యూ, విజిలెన్స్
మద్దిపాడు మండలంలో జేసీ గోపాలకృష్ణ విస్తృత సోదాలు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ సంస్థల్లో అధికార యంత్రాంగం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. నెలవారీ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు 185 సంస్థల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. రెవెన్యూ, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖల అధికారులు జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలు, హోటల్స్, సినిమా థియేటర్లు, రేషన్ షాపులు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, ఆర్వో ప్లాంట్లు, గ్యాస్ ఏజెన్సీలను విస్తృతంగా తనిఖీ చేశారు. జేసీ గోపాలకృష్ణ మద్దిపాడు మండలంలోని పలు సంస్థలను పరిశీలించారు. సీతారాంపురంలోని పెట్రోలు బంకును తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. మద్దిపాడులో రేషన్ షాపునకు వెళ్లి స్టాక్‌తోపాటు రిజిస్టర్‌ను చూశారు. 65ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ను జేసీ అందజేశారు. అనంతరం వెల్లంపల్లిలోని నందిని ట్రేడర్స్‌ను వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఎరువులు, పురుగుల మందుల స్టాక్ రికార్డులను చూశారు. దుకాణంలో ఎరువులు విక్రయించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నకిలీ ఎరువులు, పురుగు మందులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. అనంతరం సినిమా థియేటర్‌కు వెళ్లి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఆయాశాఖల అధికారులు పలు సంస్థలను పరిశీలించడమే కాకుండా రికార్డులను తనిఖీ చేశారు. ఏమైనా లోటుపాట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. రికార్డులు పక్కాగా ఉండాలని ఆదేశించారు.