రేపు జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ పోటీలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:28 AM
ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హై స్కూలులో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
ఏర్పాట్లు పూర్తి : డీఈవో కిరణ్ కుమార్
ఒంగోలు విద్య, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హై స్కూలులో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరిషత్, మునిసిపల్, ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఉదయం 10గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.