Share News

ప్రధాని సభ ఏర్పాట్లలో జిల్లా నేతలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:22 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనుండగా ప్రభుత్వపరంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో మన జిల్లాకు చెందిన పలువురు నేతలు భాగస్వామ్యమవుతున్నారు. మంత్రి రవికుమార్‌కు జనసమీకరణ బాధ్యతలు అప్పగించగా ఆయన సోమవారం అక్కడికి చేరుకున్నారు.

ప్రధాని సభ ఏర్పాట్లలో జిల్లా నేతలు
మంత్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై చర్చిస్తున్న ఎమ్మెల్యేలు ముత్తుముల, ఉగ్ర, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య తదితరులు

మంత్రి జనార్దన్‌రెడ్డి పర ్యవేక్షణలో పాల్గొన్న ఉగ్ర, అశోక్‌రెడ్డి, దామచర్ల సత్య

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు జనసమీకరణ బాధ్యతలు

డోన్‌కు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌

నల్లమల ప్రాంతంలో పోలీసుల జల్లెడ

ఒంగోలు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనుండగా ప్రభుత్వపరంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో మన జిల్లాకు చెందిన పలువురు నేతలు భాగస్వామ్యమవుతున్నారు. మంత్రి రవికుమార్‌కు జనసమీకరణ బాధ్యతలు అప్పగించగా ఆయన సోమవారం అక్కడికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌లు సవరించిన నేపథ్యంలో దాని ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 16న కర్నూలులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సభలో ప్రధాని పాల్గొంటున్నారు. సుమారు మూడు లక్షల మందితో కర్నూలు నగరానికి సమీపంలోని వన్నూరు వద్ద ఈ సభను నిర్వహిస్తున్నారు. అందుకోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధిష్ఠానం ఆదేశాలతో జిల్లాకు చెందిన మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి సోమవారం అక్కడికి వెళ్లారు. వీరు బహిరంగ సభా వేదిక, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు మంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో జనసమీకరణకు సంబంధించిన బాధ్యతలను ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు అప్పగించారు. డోన్‌ నియోజకవర్గానికి దామచచర్ల జనార్దన్‌, మంత్రాలయం బాధ్యతలు నాగేశ్వరరావుకు ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా కర్నూలు సభకు ముందు ప్రధాని శ్రీశైలం వెళ్లి మల్లన్నను దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 01:22 AM