Share News

ఎడ్ల యజమానులకు బహుమతుల పంపిణీ

ABN , Publish Date - May 23 , 2025 | 11:17 PM

తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయ స్వామి జయంతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ విభాగం ఎడ్ల పోటీల్లో గుంటూరు జిల్లా ఎడ్లు సత్తాచాటాయి.

ఎడ్ల యజమానులకు బహుమతుల పంపిణీ
ప్రథమ బహుమతి సాధించిన గుంటూరు జిల్లా ఎడ్లు

తర్లుపాడు, మే 23 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయ స్వామి జయంతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ విభాగం ఎడ్ల పోటీల్లో గుంటూరు జిల్లా ఎడ్లు సత్తాచాటాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మీదేవి ఎడ్లు 4000 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి రూ.50 వేలు కైవసం చేసుకున్నాయి. సూర్యపేట జిల్లా హుజూర్‌నగరానికి చెందిన జక్కుల సుప్రజయాదవ్‌ ఎడ్లు 3840 అడుగుల దూరాన్ని లాగి ద్వితీయ బహుమతి రూ.40 వేలు గెలుపొందాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలేనికి చెందిన గ్రామని మోహనశ్రీ(సర్పంచి) ఎడ్లు 3756 అడుగుల దూరాన్ని లాగి తృతీయ బహుమతి రూ.30వేలు దక్కించుకున్నాయి. కంభం మండలం ఎర్రబాలేనికి చెందిన వెంకటగిరి మెమలతానాయుడు ఎడ్లు 3255 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి రూ.20 వేలు గెలుపొందాయి. పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన సిద్ధి మల్లేశ్వరి ఎడ్లు 3250 అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతి రూ.10 వేలు కైవసం చేసుకున్నాయి.

గెలుపొందిన ఎడ్ల యజమానులకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:17 PM