Share News

త్వరలో కుటుంబ డిజిటల్‌ కార్డుల పంపిణీ

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:03 PM

గ్రామాలలో ప్రతి ఇంటికీ కుటుంబ డిజిటల్‌ కార్డులు పంపణీ చేస్తామని ఏపీ ప్రణాళికాశాఖ డైరెక్టర్‌ కార్యాల య అధికారి రన్జుకుమారి చెప్పారు.

త్వరలో కుటుంబ డిజిటల్‌ కార్డుల పంపిణీ

ఏపీ ప్రణాళికాశాఖ డైరెక్టర్‌ కార్యాలయ అధికారి రన్జుకుమారి

ఒంగోలు రూరల్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి) : గ్రామాలలో ప్రతి ఇంటికీ కుటుంబ డిజిటల్‌ కార్డులు పంపణీ చేస్తామని ఏపీ ప్రణాళికాశాఖ డైరెక్టర్‌ కార్యాల య అధికారి రన్జుకుమారి చెప్పారు. మం డలంలోని కరవది గ్రామ పంచాయతీలో గురువారం కుటుంబ డిజిటల్‌ కార్డులు పంపిణీపై గ్రామసచివాలయ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్డులలో పేర్లలో తేడాలు ఉం టే మార్పులుచేర్పులు చేసుకునే సౌలభ్యం కల్పించారన్నారు. కుటుంబంలో కుమారుడు, కుమార్తెలకు వివాహమైతే వారికి ప్రత్యేక కుటుంబ డిజిటల్‌ కార్డు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో శేషుబాబు, పంచాయతీ కార్యదర్శి ఎం.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:03 PM