Share News

బంగారు వ్యాపారుల మధ్య విభేదాలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:18 AM

ఒంగోలులోని బంగారు వ్యాపా రుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా యి. ది గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అ ధ్యక్షుడు తాతా ప్రసాద్‌పై అసోసియేషన్‌ సభ్యులైన కొల్లిపల్లి సురేష్‌, హనీష్‌, కొప్పు రావూరి హరిప్రసాద్‌తోపాటు భరత్‌సింహ అనే వ్యాపారులు దౌర్జన్యానికి పాల్పడిన ట్లు తెలిసింది.

 బంగారు వ్యాపారుల మధ్య విభేదాలు

నేడు బంద్‌కు పిలుపు

ఒంగోలు కార్పొరేషన్‌, జూన్‌ 27 (ఆంధ్ర జ్యోతి): ఒంగోలులోని బంగారు వ్యాపా రుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా యి. ది గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అ ధ్యక్షుడు తాతా ప్రసాద్‌పై అసోసియేషన్‌ సభ్యులైన కొల్లిపల్లి సురేష్‌, హనీష్‌, కొప్పు రావూరి హరిప్రసాద్‌తోపాటు భరత్‌సింహ అనే వ్యాపారులు దౌర్జన్యానికి పాల్పడిన ట్లు తెలిసింది. బంగారు వ్యాపారుల సం ఘం ఎన్నికల విషయంలో తలెత్తిన విభే దాలు నేపథ్యంలో శుక్రవారం రాత్రి వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమా చారం. దీంతో ప్రసాద్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసాద్‌ దుకాణంపై దాడి చేయడంతో నిరసనగా శనివారం మధ్యాహ్నం 2గం టల వరకు బంగారు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

Updated Date - Jun 28 , 2025 | 12:18 AM