అద్దంకికి డయాలసిస్ సెంటర్ ఏఆర్టీ కేంద్రాలు మంజూరు
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:11 AM
అద్దంకి నియోజకవర్గానికి డయాలసిస్, ఏఆర్‌టీ కేంద్రాలు మంజూరైనట్లు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అద్దంకి, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): అద్దంకి నియోజకవర్గానికి డయాలసిస్, ఏఆర్‌టీ కేంద్రాలు మంజూరైనట్లు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అద్దంకికి 5 బెడ్‌ల డయాలసిస్ సెంటర్, ఏఆర్టీ(యాంటీ రె ట్రోవిరల్ ధెరఫీ కేంద్రం) మంజూరయ్యాయన్నారు. త్వరలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ రోగులకు, ఏఆర్టీ సెంటర్ ద్వారా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు కేంద్రాలకు సంబంధించి భవనాల నిర్మాణం, ఆధునిక వైద్య పరికరాలు, అవసరమైన ఇతర వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధి తో బాధ పడుతున్న రోగులు ఇప్పటి వరకు ఒంగోలు, గుంటూరు తదితర పట్టణాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. అద్దంకిలో ఏర్పాటు కానున్న నేపద్యంలో అద్దంకి నియోజకవర్గంతో పాటు దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల కిడ్నీ రోగులకు అద్దంకి లోనే డయాలసిస్ చేయించుకునే అవకాశం ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు విస్తరణ దిశగా చర్యలు చేపడుతుందని రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకికి డయాలసిస్, ఏఆర్టీ కేం ద్రాలు మంజూరు చేసిన కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఽధన్యవాధములు తెలిపారు.