Share News

ఒంగోలులో డీజీపీ

ABN , Publish Date - May 29 , 2025 | 01:37 AM

విజయవాడ నుంచి కడప వెళుతూ మార్గమధ్యలో డీజీపీ హరీష్‌కుమర్‌ గుప్తా ఒంగోలులోని పోలీస్‌ అతిథిగృహంలో కొద్దిసేపు సేదతీరారు. మహానాడు భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు కడప బయల్దేరిన డీజీపీ మధ్యలో జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేశారు.

ఒంగోలులో డీజీపీ
డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఎస్పీ దామోదర్‌

బొకే ఇచ్చి స్వాగతం పలికిన ఎస్పీ

ఒంగోలు క్రైం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నుంచి కడప వెళుతూ మార్గమధ్యలో డీజీపీ హరీష్‌కుమర్‌ గుప్తా ఒంగోలులోని పోలీస్‌ అతిథిగృహంలో కొద్దిసేపు సేదతీరారు. మహానాడు భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు కడప బయల్దేరిన డీజీపీ మధ్యలో జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేశారు. ఆయన వెంట ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ మహేష్‌ చంద్ర లడ్హా, శాంతిభద్రతల అదనపు డీజీపీ ఎన్‌.మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఎస్పీ దామోదర్‌ వారికి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:06 PM