Share News

మార్మోగిన శివనామస్మరణ

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:40 AM

కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.

మార్మోగిన శివనామస్మరణ

చినగంజాం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి) : కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని మదినిండా కొలిచారు. స్వామివార్లకు రుద్రాభిషేకాలు, వివిధ ద్రవ్యాలతో అభిషేకాలతో పాటు విశేష అలంకరణలు చేశారు. చినగంజాం గంగాపార్వతీ సమేత చిదంబరేశ్వరస్వామి ఆలయం, కడవకుదురు గోకర్ణేశ్వరస్వామి ఆలయం, సోపిరాల లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి ఆలయం, కొత్తపాలెం బాలకోటేశ్వరస్వామి ఆల యం, సంతరావూరు, గొనసపూడి, పెదగంజాం, నీలాయపాలెం తదితర గ్రామాల్లోని శివాలయాలను భక్తులు దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రాలు, ఆలయాలు భక్తి పారవశ్యం తో ఉప్పొంగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపారాధనలు చేశారు. ఆలయాలు కార్తీక దీపాల వెలగులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వినియోగం చేశారు.

అద్దంకి : కార్తీక సోమవారం పూజలు భక్తులు అత్య ంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని పాతశివాలయం, వేయిస్తంభాల గుడి, కమఠేశ్వరాల యం తదితర శివాలయాలలో కార్తీక సోమవారం సందర్భంగా మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మణికేశ్వరంలోని మల్లేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించు కున్నా రు. వరదల నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో స్నానా లు చేయకుండా మణికేశ్వ రం వద్ద స్నానాల ఘాట్‌ను దేవాలయం ఈవో గుంటుపల్లి వాసుబాబు మూసి వేయించారు. ఏర్పాట్లను సీఐ సుబ్బరాజు పరిశీలిం చారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక సోమవార పూజలు

పర్చూరు : కార్తీక సోమవారం సందర్బంగా మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. వేకువ జామునుండే పెద్దఎత్తున భక్తులు చేరుకొని ఆలయాల్లో కార్తీకదీపాలు వెలిగించి పూజా కార్యక్రమా లు నిర్వహించారు. స్థానిక భీమేశ్వరస్వామి ఆలయంతో పాటు, ఉప్పుటూరు శివాలయం, చెరుకూరు, తదితర ఆలయాల్లో విశిష్ట పూజా కార్యక్రమాలు దీపోత్సవం చేపట్టారు. కార్తీక సోములు చేసుకునే భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, వృతకార్యక్రమం చేపట్టారు.

మార్టూరు : శివాలయాల్లో భక్తులు సందడిగా కనిపించారు. ముఖ్యంగా మహిళలు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మార్టూరులో నేతాజీనగర్‌ సమీపంలోని ఘట్టేశ్వరస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం సమీపంలో ఏర్పాటుచేసిన ఘట్టేశ్వరస్వామికి భక్తులు అభిషేకం చేసి, అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేశారు. జాతీయరహదారి పక్కన ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మల్లేశ్వరుడ్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అదేవిదంగా అయ్యప్ప, భవాని మాలధారులు, ఇంకా వివిధ మాలధారులు కూడా వేకువజాము నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో,దేవాలయాల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం ఏర్పడింది.

Updated Date - Nov 04 , 2025 | 12:40 AM