నీటి గుండం వద్ద భక్తులు అప్రమత్తం
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:06 AM
గుండం వద్ద భక్తులు అప్రమత్తంగా ఉం డాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.నాగయ్య అన్నారు.
ఈవో నాగయ్య
రాచర్ల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : గుండం వద్ద భక్తులు అప్రమత్తంగా ఉం డాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.నాగయ్య అన్నారు. ఇటీవల కురిసిన, కురుస్తున్న వర్షాలకు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలోని నీటి గుండానికి వరద నీరు భారీగా చేరుతుందని, గుండంలో నీటి మట్టం కూడా అధికంగా పెరిగిందని, దర్శనానికి వచ్చే భ క్తులు స్నానమాచరించే విషయంలో, గుండంలోకి దిగే విషయంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని తెలిపారు. గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని నిర్లక్ష్యంగా వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని కోరారు. తమ సిబ్బం ది గుండం వద్ద, వాగు వద్ద, ఆలయ ప్రాంగాణంలో విధులు నిర్వహిస్తున్నారని భక్తులు అవసరమైతే వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. శనివారం ప్రత్యేక పూజలు జరిగాయని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. భక్తులను ట్రాక్టర్ సహాయంతో వాగు దాటిస్తున్నామని ఆయన అన్నారు. ఏఎస్సై వై ఆదిశేషయ్య, వారి సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు.