Share News

అభివృద్ధిని చూసే చేరికలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:05 PM

ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతు న్న అభివృద్ధిని చూసి వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యా ప్తంగా పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

అభివృద్ధిని చూసే చేరికలు
టీడీపీలోకి ఆహ్వానిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతు న్న అభివృద్ధిని చూసి వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యా ప్తంగా పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండలంలోని బొట్లపాలెంలో ఆదివారం రాత్రి వైసీపీకి చెందిన కొర్రపాటి సుబ్బులు, ఏసోబు, ఏలూరి పేరయ్య కు టుంబాలు టీడీపీలో చేరారు. డాక్టర్‌ లక్ష్మి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ప్రభుత్వ పథకాల అమలును గుర్తించి వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పుచ్చ అచ్చిరెడ్డి, నాయకులు ఉల్లి ఆంజనేయులు, జి.తిమోతి, జి.శ్యాంసన్‌, విశ్వాసం, చిన్న ఏసు పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన ఆలూరి పేరయ్యకు రూ.13,800, జి.యోహాన్‌కు రూ.41వేలు సీఎం సహాయనిధి చెక్కులను డాక్టర్‌ లక్ష్మి అందజేశారు.

Updated Date - Nov 02 , 2025 | 11:05 PM