Share News

మార్కాపురం జిల్లాతోనే అభివృద్ధి

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:14 PM

మార్కాపురం జిల్లాతోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మండలంలోని నాగెళ్లముడుపులో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలకులు నూతన జిల్లాల పూర్వవిభజనలో పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.

మార్కాపురం జిల్లాతోనే అభివృద్ధి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు, డిసెంబరు 17 (ఆంధ్రజోతి) : మార్కాపురం జిల్లాతోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మండలంలోని నాగెళ్లముడుపులో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలకులు నూతన జిల్లాల పూర్వవిభజనలో పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. అప్పట్లో 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని, చివరకు పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నూతన జిల్లా ఏర్పా టు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. వైసీపీ పాలకులు వెలిగొడ ప్రాంజెక్టును పూర్తి చేశామని ప్రజలను మోసగించారన్నారు. వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నిళ్లందిస్తామన్నారు. కొనకనమిట్ల మండలంలో సు మారు రూ.3వేల కోట్లతో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారని, త్వర లో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కేకే కిషోర్‌కుమార్‌, ఎంపీడీవో ఓ.అన్నమ్మ, ఏడీఏ బాలాజీ నాయక్‌, ఈవోపీఆర్డీ రాఘవరావు, వెలుగు ఏపీఎం రమేష్‌, తాడివారిపల్లి పశువైద్యాధికారి వ్యవసాయ అధికారిని జ్యోష్ణాదేవి, మార్కాపురం ఎస్‌ఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకట రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నప రెడ్డి, టీడీపీ నాయకులు రావి బాసపతిరెడ్డి, కాశయ్య, తాడి చలమరెడ్డి, కందుల చిట్టిబాబు, పుచ్చనూతల గోపీనాథ్‌, నంబుల లక్ష్మయ్య, వేశపోగు జాను, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.40లక్షల డ్రైనేజీ కాలువ పనులకు శంకుస్థాపన

మార్కాపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భగత్‌సింగ్‌ కాలనీలో సైడ్‌ డ్రెయిన్‌ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. 19వ వార్డు పరిధిలోని భగత్‌సింగ్‌ కాలనీలో దశాబ్దాలుగా మురుగునటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే మురుగు నీరు నిలిచి ప్రజలు అవస్థలలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వార్డు ప్రజల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఒడా నిధులు రూ.40 లక్షలు ప్రధాన మురుగు కాలువ నిర్మాణానికి కేటాయించారు. ఈ సంర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిధిలో ప్రతి వార్డుకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా నిధులు కేటాయించామన్నారు. నిధుల కొరత వున్నా భగత్‌సింగ్‌ కాలనీలో ప్రజలకు ఇచ్చిన హామీమేరకు డ్రెయిన్‌ పనులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గుంటక సుబ్బారెడ్డి, కౌన్సిలర్‌ దారివేముల హర్షిత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:14 PM