Share News

ఇల్లాలి ఆరోగ్యంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:28 PM

ఇల్లాలి ఆరోగ్యంతోనే అభివృద్ధి అని టీడీపీ యువనాయకుడు అంబవరం శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఇల్లాలి ఆరోగ్యంతోనే అభివృద్ధి
పెద్దారవీడులో ప్రదర్శన నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

రాచర్ల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఇల్లాలి ఆరోగ్యంతోనే అభివృద్ధి అని టీడీపీ యువనాయకుడు అంబవరం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వస్థ్‌ నారీ సశక్త్‌ అభియాన్‌ (ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభా గ్యం) కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరో గ్య శాఖ వారు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను గురువారం ఆయన అనుములవీడు ప్రాథమిక వైద్యశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమై న కుటుంబానికి సారథులన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్‌ కే రమేష్‌, సిబ్బంది వై.రంగనాయకులు, జి రమేష్‌, ఎం ప్రసాద్‌, రవీంద్రారెడ్డి, వీరకుమారి, షమీం లక్ష్మీ, శివరామకృష్ణ, క్రాంతి కుమార్‌, స్థానిక సర్పంచ్‌ పల్నాటి లతీఫ్‌ పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : మహిళల ఆరోగ్యంతోనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని డాక్టర్‌ కనకదుర్గ తెలిపారు. మండలంలోని తిప్పాయపాలెం పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌ రోహిత్‌ నాయక్‌ ఆధ్వర్యంలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

పొదిలి : ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్యాధికారి శరత్‌చంద్ర అన్నారు. గురువారం ప్రభు త్వ వైద్యశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.గర్భిణులకు డాక్టర్‌ శివపార్వతి పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి విజయలక్ష్మి, టీఎన్‌ఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, ఏఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ ఇమామ్‌సా, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు కు ద్దూష్‌, కాటూరి శ్రీను పాల్గొన్నారు.

పెద్దారవీడు : మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని డాక్టర్‌ జగదీష్‌ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించారు. తొలుతత గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌లు గాయత్రీ గర్భిణులకు, కుసుమ దంత సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ ఏవో జాఫర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ హరినాథ్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

కొనకనమిట్ల : గొట్లగట్టు గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్‌క్యాంప్‌ ని ర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నరేంద్రకుమార్‌, ఎస్‌పీ బాలయ్య మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో పీసీ నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సు లు, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 10:28 PM