‘కనిగిరి’లో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Aug 12 , 2025 | 10:23 PM
వైసీపీ నేతల వంకర నాలుకలకు కూటమి శ్రేణులు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం జరిగిన రైతు సంబర సభలో ఆయన మాట్లాడారు.
ఓర్వలేక వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు
వంకర నాలుకలకు బుద్ధి చెప్పాలి
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల వంకర నాలుకలకు కూటమి శ్రేణులు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం జరిగిన రైతు సంబర సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతల నాలుకలు వక్రంగా తిరుగుతూ అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారన్నారు. లోలోపల మాత్రం వారి పాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేక పోయామా అని మదన పడుతున్నారన్నారన్నారు. ఈవిషయాన్ని వైసీపీ నేతలే అక్కడక్కడా తమ స్నేహితుల వద్ద మాట్లాడుతు న్నారన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళుతుందని డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. ఇలాంటి అవాకులు, చవాకులు పట్టించుకుంటూపోతే అభివృద్ధి చేయలేమన్నారు. తన ముందున్న లక్ష్యం కనిగిరి అభివృద్ధేనని అన్నారు. తాము ఆవిధంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టే వైసీపీ నేతలు రోడ్లపై చేరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండి పడ్డారు. తాము అధికారాన్ని చూపిస్తే నియోజకవ ర్గంలో ఏఒక్క వైసీపి నేత తిరగలేరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్డీఏలో క్రమశిక్షణతో మెలుగుతు న్నామని, వైసీపీ లాంటి రాక్షస పార్టీలా కాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటు న్పటికీ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖా తాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. కనిగిరి నియో జకవర్గంలో దాదాపు 50వేల మంది రైతుల ఖాతాల్లో రూ.83.96కోట్లు కేటాయించటం జరిగిందన్నారు. తొలివిడతగా ఇప్పటికే రూ28.38 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌బాబు పనిచేస్తున్నారన్నారు. అందుకే కనిగిరి ప్రాంత రైతులు కూటమి ప్రభుత్వం పై విశ్యాసాన్ని నిరూపించుకునేలా వచ్చే ఎన్నికల్లో కూడా కనిగిరిలో టీడిపి జెండా ఎగురేయాలని పిలు పునిచ్చారు.
పండుగలా రైతు సంబరం
నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి రైతు లు పెద్దఎత్తున ట్రాక్టర్‌లతో రైతు సంబరం కార్యక్ర మానికి తరలివచ్చారు. దీంతో అమరావతి ప్రాంగణం పండుగ వాతావరణంలో మారింది. అమరావతి ప్రాం గణం నుంచి ఎమ్మెల్యే రైతు సంబరం కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంగా తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ మార్కెట్‌యార్డుకు వెళ్ళారు. అయన ను అనుసరిస్తూ వందలాది ట్రాక్టర్‌లు కదిలాయి. ఒంగోలు బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోడెద్దుల సవారీ చేస్తూ ఎమ్మెల్యే మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సభకు చేరుకున్న ఎమ్మెల్యే రైతుల నుద్దేశించి ప్రసంగించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ యారవ రమాదేవి, షీప్ యార్డు చైర్మన్ తో డేటి గోపి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నంబుల వెంక టేశ్వర్లు యాదవ్, పువ్వాడి వెంకటేశ్వర్లు, వేమూరి రామయ్య, సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్), ముత్తి రెడ్డి వెంకటరెడ్డి, బొమ్మనబోయిన వెంగయ్యయాదవ్, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, రాచమల్ల శ్రీనివా సులురెడ్డి, రోషన్ సంధాని, జంషీర్ అహ్మద్, తమ్మి నేని వెంకటరెడ్డి, అడుసుమిల్లి ప్రభాకర్, మువ్వా రం గసాయి, యారవ శ్రీను, కరణం అరుణ, కమతం వెంకటేశ్వర్లు, అద్దంకి రంగబాబు, కుందురు నారా యణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా..
పామూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అన్నదాత లకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. కనిగిరి వ్వవసాయ మార్కెట్‌లో మంగళవారం నిర్వ హిస్తున్న రైతు సంబర సభకు పామూరు, సీఎస్ పురం మండలాల నుంచి రైతు ప్రగతి రథాలు మం గళవారం తరళివెళ్లాయి. ముందుగా పామూరు టీడీపీ కార్యాలయం వద్ద నుంచి పలు ట్రాక్టర్‌లను ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.