Share News

అందరి సహకారంతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:01 AM

ఆరోగ్య కేంద్రా లను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు మండలంలోని టీడీపీ నాయకులు, ప్రజలు నాగి రెడ్డిపల్లి ప్రభుత్వ అసుపత్రికి రూ.ఆరు లక్షల విలువ గల బెడ్లు, కుర్చీలు, టేబుల్స్‌, ఫ్రిడ్జ్‌, ఆపరేషన్‌ ఽథియేటర్‌, మెడికల్‌ పరికరాలు అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆసుప త్రిని సందర్శించి పరికరాలను పరిశీలించారు.

అందరి సహకారంతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి
వెలిగండ్ల: శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య కేంద్రా లను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు మండలంలోని టీడీపీ నాయకులు, ప్రజలు నాగి రెడ్డిపల్లి ప్రభుత్వ అసుపత్రికి రూ.ఆరు లక్షల విలువ గల బెడ్లు, కుర్చీలు, టేబుల్స్‌, ఫ్రిడ్జ్‌, ఆపరేషన్‌ ఽథియేటర్‌, మెడికల్‌ పరికరాలు అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆసుప త్రిని సందర్శించి పరికరాలను పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి అభి వృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయ మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. అం దరి సహకారంతో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పది సంవత్సరాల తర్వాత సిజేరియన్‌ ప్రసవ సేవలు ప్రా రంభమయ్యాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా సలహాతో కనిగిరి వైద్యశాలలో కంగారు మదర్‌ కేర్‌ విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. ఆసుపత్రిలో ఓపీల సంఖ్య పెరిగిందన్నారు. దాతల సహకారం వల్లే ఆస్పత్రిలో సేవలు పునరుద్ధరించినట్టు చెప్పారు. అదే స్ఫూర్తితో నాగిరెడ్డిపల్లి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తే చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకు దాతల స హకారం కోరడంతో వెంటనే మూడు నెలల్లో ఆసుపత్రి అభివృద్ధికి సహరించడం అభినందనీయమన్నారు. కా ర్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల అధ్యక్షుడు ముత్తి రెడ్డి నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్యామల కాశిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, నియో జకవర్గ రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, ఒం గోలు శ్రీను, చిలకల వెంకటేశ్వర్లు, మీనిగ కాశయ్య, సానజయపాల్‌ రెడ్డి, సాన నారయణరెడ్డి, రాజగోపాల్‌, కేసరి రమణారెడ్డి, చౌడారెడ్డి, కారంపూడి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారయణ, కార్యకర్తలు పాల్గోన్నారు

పరిహారం అందేలా కృషిచేస్తా!

ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా కృషి చేస్తామని ఎ మ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని పేరంగుడిపల్లి కొ త్తపల్లి వద్ద నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ భూ బాధితులను ఆదివారం ఎమ్మెల్యే స్వ యంగా కలసి మాట్లాడారు. పేరంగుడిపల్లి కొత్తపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ ఏర్పాటుతో ఏడు గృహాలను పేదలు కోల్పోతున్నారు. గతం లో రెవెన్యూ అధికారుల తప్పిదాలతో అక్క డ గృహాలే లేవని నమోదు చేశారు. ఇది సమస్యగా మారి రైల్వేలైన్‌ ఏర్పాటును బాధితులు అ డ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఈవిషయాన్ని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిహారం అందించాలని కోరారు. ఈక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర బాధితుల ను కలసి సర్దిచెప్పారు. అభివృద్ది కార్యక్రమాలను అ డ్డుకుంటే స్థానికంగా ఉన్నవారే నష్టపోతారన్నారు. ప్రభు త్వం నుంచి సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో బాధితులు సానుకూలంగా రైల్వేలైన్‌ ఏర్పాటకు సహకరిస్తామని ఎమ్మెల్యే ఎదుట రైల్వే అధికారులు, కాంట్రాక్టర్‌కు చెప్పటంతో సమస్య పరిష్కారమైంది. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవిశంకర్‌, రైల్వే ఇంజనీర్‌ జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:01 AM