Share News

మార్కాపురం జిల్లాతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Dec 09 , 2025 | 10:52 PM

మార్కాపురం జిల్లాను అభివృద్ధి దిశగా నడిచేలా నాయకులు, అధికారులు కృషిచేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన బాబురావు కోరారు.

మార్కాపురం జిల్లాతోనే అభివృద్ధి సాధ్యం
మునగపాడులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

కొనకనమిట్ల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి ) : మార్కాపురం జిల్లాను అభివృద్ధి దిశగా నడిచేలా నాయకులు, అధికారులు కృషిచేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన బాబురావు కోరారు. మండలంలోని మునగపాడు, బసావాపురం గ్రామాలలో సీఎం చంద్రబాబునాయుడి చిత్రపటానికి మంగళవారం టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి అన్నమాట ప్రకారం జిల్లా ఏర్పాటు ప్రకటన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కుందూరు కాశిరెడ్డి, యోదుబాటి వెంకటనారాయణ, కాటంరాజు, తాతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, భాషపతినాయుడు, భీమారెడ్డి, రేగడపల్లి సొసైటీ అధ్యక్షుడు కనకం నరసింహారావు, శ్రీకాంత్‌రెడ్డి, అంజిరెడ్డి, గురువయ్య, అంకాల రోశయ్య, శ్రీనివాస్‌, పెద్దన్న, రమణయ్య, వెంకన్నా, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


జిల్లా ఏర్పాటు అభినందనీయం

పొదిలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని సూదనగుంట గ్రామంలో సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పఽథంలో నడిపించడంలో చంద్రబాబునాయుడిని మించిన వ్యక్తి మరొకరు లేరని కొనియాడారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్‌, మాదిరెడ్డిపాలెం సొసైటీ చైర్మన్‌ యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు రసూల్‌, శివాలయం మాజీ చైర్మన్‌ సామంతపూడి నాగేశ్వరరావు, శివాలయం చైర్మన్‌ ఒగ్గు వెంకట్రామయ్య, మండల కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు ఖుద్దూస్‌, ముని శ్రీను, తానికొండ వెంకట్రావు, గ్రామ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 10:52 PM