Share News

అభివృద్ధి సరే.. ముంపు సంగతేమిటి?

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:36 AM

వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో అధికారుల మందుచూపు కొరవడంతో పంటపొలాలు, గ్రామాల సైతం మంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది.

అభివృద్ధి సరే.. ముంపు సంగతేమిటి?

పర్చూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో అధికారుల మందుచూపు కొరవడంతో పంటపొలాలు, గ్రామాల సైతం మంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు. భారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా కాల్వల నిర్మాణంపై దృష్టి సారించ కుండా రోడ్డు నిర్మాణం చేస్తూ చేతులు దులుపు కుంటున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పర్చూరు సమీపంలో నాగులపాలెం ఎత్తిపోతల పథకం వద్ద అంచు వరకు సర్వీసు రోడ్డు నిర్మించారు. ఎగువ నీరు ఎటు పోవాలో అర్ధంకానికి పరిస్థితి నెలకొంది. నూతన జాతీయ రహదారి పొడవునా ఒకటి రెండు చోట్ల తూములు వేసి చేతులు దులుపుకోవడం మినహా పూర్తిస్ధాయిలో నీటి సరఫరా జరిగేలా చేర్యలు చేపట్టిన దాఖలాలు కనపించడం లేదు. ఇటు డ్రైనేజ్‌, అటు జాతీ య రహదారుల సంస్థ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి నెల కొందని రైతులు వాపోతున్నారు. నిర్మాణ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే వరద ముంపు ఉండేది కాదని నిపుణులు అంటు న్నారు. ఇప్పటికైనా డ్రైనేజ్‌, జాతీయ రహ దారుల సంస్ధ అధికారులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపతికన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. హైవే రోడ్డు నిర్మాణంతో అభివృద్ది మాట ఏమోకానీ, వరద నీరు పంట పొలాల్లోకి చేరి నిల్వ ఉంటే తమ భూములు చౌడుగా మారతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Sep 28 , 2025 | 02:36 AM