అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2025 | 10:51 PM
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొగ ళ్లూరులో వృద్ధులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
వెలిగండ్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొగ ళ్లూరులో వృద్ధులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నా ప్రజల కు ఎటువంటి ఇబ్బందిలేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాగా నే పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు ఓకేసా రి పెంచి కూట మి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. పింఛన్ల కోసమే ఏడాదికి రూ.34 వేల కోట్లు వెచ్చు స్తుందన్నారు. ఇచ్చిన హమీలను తుచ తప్పకుండా అమలుచేస్తుందన్నారు.
30 ఏళ్ల క్రితం తొలిసారి సీఎంగా ఇదే రోజున చంద్ర బాబునాయుడు బాధ్యతలు చేపట్టారని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు సీఎంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ముఖ్యమం త్రిగా ప్రభుత్వ వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్ర జల వద్దకు పాలన, జన్మభూమి, నీరు-మీరు, పచ్చద నం- పరిశుభ్రత పథకాల ద్వారా పాలన సంస్కరణలు శ్రీకారం చుట్టారనారు. రైతు బజార్లు ఏర్పాటుచేసి మ ధ్యవర్తుల దోపీడీని అరికట్టారన్నారు. విభజన అనంత రం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా బా ధ్యతలు చూపట్టారన్నారు. అమరావతిగా రాజధాని కల ను ఆవిష్కరించారన్నారు. మళ్లీ ప్రజా తీర్పుతో 2024 ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి అఖండ విజ యాన్ని సాధించారని చెప్పారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తం గా తయారైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పడుతు న్నార న్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మ న్ శ్యామల కాశిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, కొండు భాస్కర్‌రెడ్డి, బైసని సుబ్రమ ణ్యం, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిలో మైలురాయి మ్యాజిక్ డ్రైన్
ప్రత్యేక టెక్నాలజీతో గ్రామాల్లో మ్యా జిక్ డ్రైన్లను నిర్మించడమనేది కొత్త మై లురాయి అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. మండలంలోని చోడవరం గ్రామ పంచాయతీలో రూ. 12 లక్షల ఉపాధి నిధులతో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్‌లకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెడల్పు తక్కువగా ఉన్న గ్రామాల్లో వీటి నిర్మాణం చేప డుతున్నట్టు చెప్పారు.
కాల్వలను మూడు లేయర్లగా తవ్వి ఒక్కో లేయర్‌ను ఒక్కో సైజ్ మెటల్‌తో నిర్మిస్తార న్నారు. ఇళ్ల నుంచి వచ్చిన మురుగునీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డ్యామా పీడీ జోసెఫ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, ఏపీవో నాయక్, తదితరులు పాల్గొన్నారు.