Share News

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:34 AM

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఒమ్మెవరంలో జరిగి న సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఇం టింటి ప్రచారం నిర్వహించారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే బీఎన్‌

నాగులుప్పలపాడు, జూలై 9 (ఆంధ్రజ్యో తి): అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఒమ్మెవరంలో జరిగి న సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఇం టింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు ఆయన ఘన స్వాగ తం పలికారు. అనంతరం అక్కడి ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయా లను తెలుసుకొన్నారు. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే కరపత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథ కాలు అందిస్తామన్నారు. గత వైసీపీ పాల నలో రాష్ట్రం అప్పులపాలయిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడా నికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చె ప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నార న్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలయిందని, సామాజిక పింఛన్లు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, కూటమి ప్ర భుత్వం చెప్పిన మాట ప్రకారం పింఛన్లు ఒ క్కసారిగా పెంచి అందిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎందరు పిల్లలుంటే అంతమం దికి అమ్మకు వందనం పథకం ద్వారా నగదు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలను అభివృ ద్ధి వైపు పరుగులు తీసేలా సీఎం చంద్రబాబు పి4ను విజయవంతంగా అమలు చేస్తున్నార ని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మం చి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మం డల ప్రధాన కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్‌, గ్రామ అధ్యక్షుడు కొమ్మాలపాటి సురేష్‌, స ర్పంచ్‌ పాలపర్తి బాలకోటి, కొమ్మినేని రమేష్‌, కల్లూరి రామారావు, కోటేశ్వరరావు, పిట్టా అం జి, పిన్నక సుబ్బారావు, వాసుమల్లి నాగార్జున, పీకా బైరాగి, కనగాల శ్రీనివాసరావు, సెల్వం, మెట్టు సుబ్బయ్యనాయుడు, తెలగతోటి జాన్స న్‌, మండవ వెంకటేశ్వర్లు, అంకిరెడ్డి, కుర్రా వీ రాంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:35 AM