Share News

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:46 PM

గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

కొత్తకోట పంచాయతీలో రూ.6 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే పంచాయతీ నిధులు ఒక్క రూపాయి కూడా ఉండేవి కాదని, కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిన దాఖలాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల అభివృద్ధి రైతుల సంక్షేమం లక్ష్యంగా సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్తకోట పంచాయతీలో భూగర్భజలాలను పెంపొందించాలనే లక్ష్యంతో రూ. 5.13 కోట్లతో ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్‌ను ఆయన ప్రారంభించారు. ఎక్స్‌కవేటర్‌ను నడిపి శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, రూ. 20.80 లక్షలతో విలేజ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను, రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. సచివాలయ భవనంలో సర్పంచ్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంటును ప్రారంభించి వారిని అభినందించారు. కార్యక్రమంలో జడ్‌పీటీసీ బుడత మధుసూదన్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, మండలపార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు బోదనబోయిన గోపాలకృష్ణ, జయరామిరెడ్డి, కడియం శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:46 PM