Share News

కూటమి పాలనలో అభివృద్ధి వేగవంతం

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:29 AM

కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బీఎ న్‌.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కూటమి పాలనలో అభివృద్ధి వేగవంతం

ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

సంతనూతలపాడు, డిసెంబరు 19(ఆంధ్ర జ్యోతి): కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బీఎ న్‌.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని విరాట్‌నగర్‌, సమతానగర్‌పరిధిలోని 38, 39, 40, 41, 43 డివిజన్‌లలో సీసీరోడ్లకు, పైపులైన్ల ఏర్పాటు, సైడుకాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే బీఎన్‌ శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునా యుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అ భివృద్ధిలో ముందుకుసాగుతోందన్నారు. కార్య క్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, కమిషన ర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణరె డ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హ రిబాబు, రాష్ట్ర మహిళ నాయకురాలు అరికట్ల సుమతి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, కార్పొ రేటర్లు తదితరులు పాల్గొన్నారు

అర్జీల స్వీకరణ

ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఒంగోలులోని తన కార్యాలయలో నిర్వహించిన ప్రజాదర్బా ర్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ముఖ్యంగా ఇళ్ల స్ధలాలు, గృహనిర్మాణ అనుమ తులు, కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్‌లు తదితర అంశాలపై వచ్చిన 30 అర్జీలను వెం టనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇ చ్చారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:29 AM