Share News

అర్హుల పింఛన్‌లను తొలగించం

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:33 AM

ల్లాలో అర్హుల పింఛన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. అనర్హుల పింఛన్లు ఉంటే మాత్రం తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. కలెక్టరేట్‌ శనివారం జరిగిన ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి స్వామి అనంతరం విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

అర్హుల పింఛన్‌లను తొలగించం

మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అర్హుల పింఛన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. అనర్హుల పింఛన్లు ఉంటే మాత్రం తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. కలెక్టరేట్‌ శనివారం జరిగిన ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి స్వామి అనంతరం విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా దివ్యాంగులు, ఇతర సామాజిక పింఛన్లను క్రమం తప్పకుండా ఒకటో తేదీనే ఇస్తున్నామని తెలిపారు. డీఆర్సీ సమావేశంలో కూడా అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ చేసి అనర్హులను తొలగించినట్లు తెలిపారు. అర్హులకు ఎలాంటి అన్యా యం జరగదని మంత్రి స్వామి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో వెరిఫికేషన్‌ (పరిశీలన) చేస్తున్నారన్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే పునఃపరిశీలించి పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అర్హత ఉంటే నోటీసులు ఇస్తే సచివాలయంలో అప్పీల్‌ చేసుకోవచ్చని మంత్రి స్వామి తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:33 AM