పల్లె ప్రగతిపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:56 PM
పల్లె ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసంనడుం బిగించిన నేత డిప్యూటీ సీఎం వవన్‌కల్యాణ్ అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
ఘనంగా పవన్ కల్యాణ్
జన్మదిన వేడుకలు
కనిగిరి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసంనడుం బిగించిన నేత డిప్యూటీ సీఎం వవన్‌కల్యాణ్ అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసే న నాయకులు నాగరాజు, దేవకి వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం రోగులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించటంలో డిప్యూటి సీఎం అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదన్నారు. జనసేన పాయింట్ ఆఫ్ కాంటా క్ట్ వరికూటి నాగరాజు, దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ ప్రజాప్రతినిధిగా వచ్చే జీతాన్ని కూడా పేద ప్రజ లకు పంపిణీ చేస్తున్న నేత పవన్‌కల్యాణ్ ఒక్కరేనని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యక ర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
దర్శిలో పుట్టినరోజు వేడుకలు
దర్శి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను దర్శిలో మంగళవా రం కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. సా ్థనిక జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు తదితరులు పుట్టినరోజు కేకు కట్‌చేసి అభిమా నులకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పోరాట పటిమతో పవన్‌కల్యాణ్ ఉన్నత శిఖరాలు అందుకున్నారని ప్రశంసించారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు ఆయన మారుపేరుగా నిలిచారన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సు బ్బారావు, జనసేన నాయకులు కుప్పాల పాపా రావు, పసుపులేటి చిరంజీవి, బీజేపీ నాయకుడు టి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొనకొండ: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాన్ జన్మదిన సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కేకు కట్ చేశారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఎం. షఫిఉ ల్లాఖాన్(బాజి), బండారు వెంకట్, పులిమి రమణా యాదవ్, ఆసా సాంబశివరావు, షేక్ సుభానీ, శ్రీరాములు, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
పీసీపల్లి: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదినం సందర్భంగా మంగళవారం పీసీపల్లిలో కేకు కట్ చే శారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన మం డల అధ్యక్షుడు బండారు రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చేతుల మీదుగా రోగులకు పాలు, పండ్లు పంపిణీచేశారు. తదనంతరం పేదలకు దుస్తులు పంపిణీచేశారు. కార్యక్రమంలో కూటమి నా యకులు వేమూరి రామయ్య, పువ్వాడి నాగరాజు, పులి ప్రతాప్‌రెడ్డి, బత్తుల రామక్రిష్ణ, నాగేష్, మల్లికార్జున, మోహన్‌క్రిష్ణ, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరు: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జ న్మదిన వేడుకలను మంగళవారం మండలంలో ఘనం గా నిర్వహించారు. పసుపుగల్లు బస్టాండ్ సెంటర్‌లో 15 కేజీల కేక్‌ను జనసేన మండల అధ్యక్షుడు తోట రామారావు కట్‌చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు నాగార్జున, గూడాల శివశంకర్ రెడ్డి, సాంబశివారెడ్డి, గోపిశెట్టి నాగార్జున, బంగారయ్య, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పామూరులో చీరెలు పంపిణీ
పామూరు, సెస్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను మం డలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సింగ్‌ల్‌విండో కార్యాలయం వద్ద కేకు కట్‌చేశారు. ఈసందర్భంగా జనసేన నాయకులు వెంగళశెట్టి బాబురావు ఆర్థిక స హకారంతో 125 మంది నిరుపేద మహిళలకు సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబుతో కలిసి చీరలు పంపిణీ చేశారు. స్థానిక పద్మావతి అతిథి గృహంలో 95 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వరికూటి నాగరాజు, దేవకి వెంకటేశ్వర్లు, కేవీ రమణయ్య, బొల్లా నరసింహారావు, సయ్యద్ అ మీర్‌బాబు, ఇర్రి కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.