Share News

జేపీచెరువులో డెంగ్యూ?

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:21 PM

రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామంలో పదేళ్ల బాలికకు డెంగ్యూ వ్యాధి సోకింది.

జేపీచెరువులో డెంగ్యూ?

రాచర్ల, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జేపీ చెరువు గ్రామంలో పదేళ్ల బాలికకు డెంగ్యూ వ్యాధి సోకింది. గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన బాలిక జ్వరానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బాలికను గిద్దలూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోందని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరో బాలుడికి కూడా డెంగ్యూ లక్షణాలు కనిపించినట్లు చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. వైద్య సిబ్బంది వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ వ్యాధులు నివారణకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ డెంగ్యూ తదితర వ్యాధులు వస్తున్నాయి. వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని పారిశుధ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 10:54 AM