Share News

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:54 AM

సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు పల్లె పోగు విజయ్‌బాబు(19) శుక్రవారం సాయంత్రం లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ   సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి మృతి

సంతమాగులూరు సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు పల్లె పోగు విజయ్‌బాబు(19) శుక్రవారం సాయంత్రం లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం... పల్లెపోగు విజయ్‌బాబు నర్సరావుపేటలోని నందమూరి బసవ తారక రామారావు డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. రోజూ ఏల్చూరు గ్రామం నుంచి బస్సు పాస్‌తో నరసరావుపేట చేరుకొని కాలేజీకి వెళ్లేవాడు. మోటార్‌ సైకిల్‌పై కాలేజీకి వెళ్లి తిరుగు ప్రయాణంలో పల్నాడు జిల్లా, ఉప్పలపాడు వద్ద లారీని తప్పించబోయి ఢీకొట్టాడు. విజయ్‌ బాబు తండ్రి ఆశీర్వాదం చెన్నైలో బేల్దారీ పనులకెళ్లారు. విజయ్‌బాబు ఏల్చూరులో నాయనమ్మ దగ్గర ఉంటూ కాలేజీకి వెళుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఏల్చూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Sep 13 , 2025 | 12:54 AM