ఉపాధ్యయులపై ప్రభుత్వానికి అంకితభావం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:11 PM
ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అంకితభావంతో పని చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నా రు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆటలపోటీల ప్రారంభంలో ఎమ్మెల్యే కందుల
మార్కాపురం వన్‌టౌన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అంకితభావంతో పని చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నా రు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ పోటీలు మండల స్థాయిలో నిర్వహించి, డివిజన్ స్థాయి లో విజేతలను జిల్లా స్థాయిలో పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శర్వాణీ, ఎంఈవోలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆటలతో ఆరోగ్యం
విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు అవసరమని సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి అన్నారు. స్థానిక సాయి బాలాజీ పాఠశాలలో పీవీ సింధు ఇండోర్ షటిల్ కోర్టును సోమవారం ఆయన ప్రాంరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ గల చదువు క్రీడలలో పా ల్గొనడం ఎంతో అవసరం అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి షటిల్‌కు ఎంపికైన విద్యార్థులు త్రిభువణ, అభిలా్‌షను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సయ్యాద్ మస్తాన్ వలీ, డైరెక్టర్ ప్రకాష్ రావు, ఫిజికల్ డైరెక్టర్లు సయ్యద్ వలీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.