ఉసురు తీసిన అప్పులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:11 AM
అప్పులు జిల్లాలో మరో రైతు ప్రాణం తీశాయి. ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గూడేనికి చెందిన దేశావత్ రాములు నాయక్ (69) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
పాలుట్లగూడెంలో వృద్ధ గిరిజన రైతు ఆత్మహత్య
ఎర్రగొండపాలెం రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : అప్పులు జిల్లాలో మరో రైతు ప్రాణం తీశాయి. ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గూడేనికి చెందిన దేశావత్ రాములు నాయక్ (69) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నాయక్ గూడెంలోని నాలుగు ఎకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశాడు. పంటలు సక్రమంగా పండకపోవడం, ధరలు లేకపోవడంతో నష్టపోయాడు. సుమారు రూ.6లక్షల మేర అప్పులు మిగిలాయి. వాటిని తీర్చలేక గత కొద్ది రోజులుగా రాములు నాయక్ తీవ్ర మనోవేదనలో ఉన్నారు. బుధవారం ఇంటిలోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎర్రగొండపాలెం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. రాములు నాయక్‌కు భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందరికీ వివాహమైంది.