Share News

చేతులెత్తేసిన డీలర్లు

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:18 AM

జిల్లాలో స్మార్ట్‌ రైస్‌ కార్డులను లబ్ధిదారులకు అందించే విషయంలో రేషన్‌షాపు డీలర్లు చేతులె త్తేస్తున్నారు. గతంలో ఉన్న అడ్రస్‌ల ప్రకారం పౌరసరఫరాలశాఖ అధికా రులు ఆ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను డీలర్లకు అప్పగించారు.

చేతులెత్తేసిన డీలర్లు

స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీలో అయోమయం

కార్డుదారులను గుర్తించేందుకు కష్టపడుతున్న అధికారులు

గ్రామీణ ప్రాంతాల్లో కొంత సమాచారం లభ్యం

పట్టణాల్లో మాత్రం భారీగా పెండింగ్‌

పాతవాటితోనే బియ్యం తీసుకుంటున్న వైనం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో స్మార్ట్‌ రైస్‌ కార్డులను లబ్ధిదారులకు అందించే విషయంలో రేషన్‌షాపు డీలర్లు చేతులె త్తేస్తున్నారు. గతంలో ఉన్న అడ్రస్‌ల ప్రకారం పౌరసరఫరాలశాఖ అధికా రులు ఆ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను డీలర్లకు అప్పగించారు. నెలక్రితం వారు పంపిణీ ప్రారంభిం చారు. కార్డుదారులు అందుబాటులో లేకపోవడంతో ఒక్కో డీలర్‌ వద్ద భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకు 6,51,820 రైస్‌కార్డులు రాగా ఇప్పటివరకు 5,87,222 పంపిణీ చేశారు. ఇంకా 64,598 డీలర్ల వద్దనే ఉన్నాయి. గతంలో ఇచ్చిన తెల్లరేషన్‌ కార్డులో ఉన్న అడ్రసు ప్రకారం ఈ రైస్‌ కార్డులు ఆయా రేషన్‌ షాపుల డీలర్లకు అప్పగించగా ఇప్పుడు ఆ కార్డుదారులు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారిని గుర్తించడం కష్టతరంగా మారింది.

నెలాఖరులోపు పంపిణీ ఎలా?

గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువగా రైస్‌కార్డులు మిగలగా ఆ కార్డు దారులు ఎక్కడ ఉన్నారన్న దానిపై కొంత సమాచారాన్ని డీలర్లు సేక రించారు. పట్టణప్రాంతాల్లో మాత్రం పాత అడ్రస్సుల్లో కార్డుదారులు లేరు. పాత కార్డుల ద్వారా కూడా బియ్యం తీసుకునే సౌలభ్యం ఉండ టంతో కొంతమంది ఈ నెలలో రేషన్‌ సరుకులు తీసుకున్నట్లు గుర్తిం చారు. ఇప్పుడు ఆ కార్డుదారులు ఏప్రాంతంలో తీసుకున్నారు? జిల్లా లోనా, లేక ఇతర ప్రాంతాల్లో తీసుకున్నారా? అనేవిషయాన్ని గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు మిమగ్నమయ్యారు. ప్రభు త్వం ఈ నెలాఖరులోపు పూర్తిస్థాయిలో కార్డుదారులకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న వారికి ఏవిధంగా పంపిణీ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 01:18 AM