Share News

డీసీఎంఎస్‌ను అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:53 AM

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని శ్యామల కాశిరెడ్డి తెలిపారు. డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

డీసీఎంఎస్‌ను అభివృద్ధి చేస్తా
బాధ్యతలు స్వీకరిస్తున్న కాశిరెడ్డి, పక్కన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, డీసీసీబీ చైర్మన్‌ డాక్టర్‌ సీతారామయ్య

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాశిరెడ్డి

ఒంగోలు విద్య, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని శ్యామల కాశిరెడ్డి తెలిపారు. డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తన నియామకానికి ముఖ్యకారకులైన కనిగిరి, ఒంగోలు ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత కార్యాలయంలోని తన చాంబర్‌లో పూజలు చేశారు. అనంతరం కాశిరెడ్డిని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తీసుకెళ్లి సీటులో కూర్చోబెట్టారు. తర్వాత ఆయనతో జిల్లా సహకారాధికారి(డీసీవో) ఎన్‌.ఇందిరాదేవి సంతకం చేయించారు. కనిగిరి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు బొకేలు, శాలువలతో కాశిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బిజినెస్‌ మేనేజర్‌ రామచంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 01:53 AM