ఉపాధ్యాయునిగా దర్శి తహసీల్దార్
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:47 PM
దర్శి, తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్ ఉపాధ్యాయునిగా మారారు. బుధవారం రాత్రి విద్యార్థినులకు పాఠం బోధించారు.
దర్శి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్ ఉపాధ్యాయునిగా మారారు. బుధవారం రాత్రి విద్యార్థినులకు పాఠం బోధించారు. స్థానిక బాలిక హాస్టల్‌లో ట్యూటర్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ హాస్టల్‌కు వెళ్లి ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో కొన్ని అంశాలు చెప్పారు. పదో తరగతి విద్యార్థినులకు పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఆయన బోధన చేయడంపై బాలికల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైనప్పుడు తాను బోధన చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.