Share News

‘దర్శి’లో రూ.28.63 కోట్లు జమ

ABN , Publish Date - Nov 19 , 2025 | 10:45 PM

కురిచేడు మండలంలోని పొట్లపాడులో బుధవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది.

‘దర్శి’లో రూ.28.63 కోట్లు జమ
డ్రోన్‌ను పరిశీలించి రైతులకు సూచనలిస్తున్న ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి

అన్నదాత సుఖీభవ చెక్కును పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి

కురిచేడు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి) : మండలంలోని పొట్లపాడులో బుధవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్‌ జ్యోతి సుబ్బు అఽధ్యతన జరిగింది. ముఖ్య అతిఽథులుగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, యువనాయకులు కడియాల లలిత్‌ సాగర్‌లు హాజరయ్యారు. లక్ష్మి రైతులతో సమావేశమై వారి సమస్యలపై మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పియం కిసాన్‌ చెక్కును రైతులకు లక్ష్మి అందజేశారు. డ్రోన్లను పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ ఏడీ బాలాజీనాయక్‌ మాట్లాడుతూ నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధులు రూ.28.63 కోట్లు విడుదల అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి జాన్సన్‌, వ్యవసాయ శాఖ ఏడీ బాలాజీనాయక్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రవణ్‌కుమార్‌, ఎంపీడీవో సత్యప్రసాద్‌, 5 మండలాల వ్యవసాయాధికారులు, పంచాయతీ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య, మోడి ఆంజనేయులు, మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్‌ పార్టీ అధ్యక్షులు చిన్నా, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు, గడ్డం బాలయ్య, నాగులపాటి శివకోటేశ్వరరావు, మొఘల్‌ మస్తాన్‌వలి, షేక్‌ సునీల్‌, చమిడిశెట్టి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 10:45 PM