దండాలయ్యా .. ఉండ్రాలయ్యా
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:50 AM
వినాయక చవితి పర్వదిన వేడుకలను భక్తులు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
పర్చూరు, అగస్టు 28 (ఆంఽధ్రజ్యోతి) : వినాయక చవితి పర్వదిన వేడుకలను భక్తులు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోనిపపలు కూడళ్లలో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో దంపతులు పాల్గొని స్వామివార్ల భక్తిని చాటుకున్నారు. వినాయకచవితి సందర్బంగా ఏర్పాటు చేసిన పందిళ్ల ను రంగు రంగు తోరణాలతో అలంకరించారు. పర్చూరు టీనగర్‌లో ఓ ముస్లిం యువతి రూ.40వేలు విలువైన వినాయక విగ్రహాన్ని అందజేసి ఐక్యతను చాటారు. అదేవిధంగా తూర్పువారివీధి, మద్దబజార్, జయంతి కాలనీ, రామాలయం వీధి, అద్దంకి మాన్యం, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజాకార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా నాగుపాలెం, వీరన్నపాలెం, ఉప్పుటూరు, చెరుకూరు, కొల్లావారిపాలెం, ఉప్పుటూరు, చెరుకూరు, తిమ్మరాజుపాలెం, దేవరపల్లి, అన్నంబొట్లవారిపాలెం, నూతలపాడు, పోతుకట్ల తదితర గ్రామాల్లో వినాయక చవితి పండుగ అత్యంత వేడుకగా జరిగాయి.
కారంచేడు : మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పర్వదిన వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. స్థానిక మాస్కోబజార్, ప్రధాన వీధుల్లోని ఆయా కూడళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిళ్లలో గణనాథుల విగ్రహాలతో విశిష్ట పూజలు చేపట్టారు. మండలంలోని కుంకలమర్రు, స్వర్ణ, స్వర్ణపాలెం, దగ్గుబాడు, జరుబుల వారిపాలెం, నాయుడు వారిపాలెం తదితర గ్రామాల్లో వినాయక చవితి పండుగను అత్యంత వేడుకగా జరుపుకున్నారు.
పంగులూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఉత్పవ కమిటీలు ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వాటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వినాయ కచవితి పర్వదినాన్ని పురస్కరించు కుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో వినాయక విగ్రహాల ను ఉంచి వీధుల్లో మేళతాళాలతో, బాణాసంచా కాలుస్తూ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊరే గింపు నిర్వహించి యువత సందడి చేశారు. అనంతరం మండపాలలో కొలువుదీరిన గణనాథులకు భక్తులు శాస్ర్తోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. గ్రామాలలోని పలువాడలలో ఏర్పాటు చేసిన మండపాలలో బుధ, గురువారాలలో గణనాథు లకు పూజాకార్యక్రమాలు కొనసాగించడంతో గ్రామా లలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది..
ఇంకొల్లు : వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరిం చుకొని, మండలంలో వినాయకచవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంకొల్లులో రామమందిరం, కృష్ణనగర్ ఆంజనేయస్వామి గుడి, నాగులచెరువుకట్ట, అభయాంజనేయస్వామి ప్రధాన వీధుల్లో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. గంగవరం, ఇడుపులపాడు, భీమవరం, నాగండ్ల, హనుమోజిపాలెం గ్రామాలలో వినాయకచవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రూపాలలో గణపతి విగ్రహాలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందజేసారు.
మార్టూరు : వినాయకచవితి పర్వదినాన్ని బుధవారం మండలంలో ప్రజానీకం ఘనంగా జరుపుకున్నారు. వినాయకుని విగ్రహాలను కొనుగోలు కేంద్రం నుంచి మండపాలకు తరలించే సమయంలో యువకులు భారీగా బాణాసంచా కాలుస్తూ, ఆటపాటలతో, డప్పుల మోతతో ఊరేగింపుగా మండపాలకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో కార్యాలయప్రతినిధి కొమ్మినేని వెంకట్ దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అర్చకులు శంకర్‌శాస్త్రి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సిబ్బంది నైవేద్యాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కామేపల్లి హరిబాబు, సిబ్బంది సతీష్, సంపత్, అశోక్, మహేష్, అనిల్, సాయి, ఫణి తదితరులు పాల్గొన్నారు. అదేవిదంగా మార్టూరులోని తూర్పుబజారులో కావలి వద్ద చాగల్లు నుంచి తీసుకొచ్చిన 14 అడుగులు ఎతైన వినాయకుని విగ్రహాన్ని ,పడమర బజారున విజయవాడ దగ్గ నన్నూరు నుండి తీసుకువచ్చిన 15 అడుగుల ఎతైన విగ్రహాన్ని, నేతాజీనగర్‌లో గుంటూరు నుండి తీసుకువచ్చిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. బుధ, గురు వారాలు స్వామి వారి విగ్రహాల ముందు పలువురు దంపతులు కూర్చుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాత్రి సమయాలలో పలు సాంస్క్రతిక కార్యక్రమాలను నిర్వహించారు.
బల్లికురవ : మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం వినాయకచవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామాలలో విద్యార్థులు పొలాలకు వెళ్లి వినాయకుడికి ఇష్టమైన పత్రిని సేకరించారు అనంతరం గ్రామ కూడళ్లలో, గృహాలలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా బల్లికురవ మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో భక్తులు పోలీసుల అనుమతుల మేరకు 116 వినాయ కుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు
చినగంజాం : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో బుధ, గురువారాలలో వైభవంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకొని వీఽధివీధిన గణనాఽథుని విగ్రహాలను పోటా పోటీగా ఏర్పాటు చేశారు. మండపాల్లో విభన్న రూపాల్లో ఉన్న గపణయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండపాలను రంగు రంగుల విద్యుత్ దీపాల ఆలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గృహలలో మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి విద్యార్థులు పూజలు నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో కొలువు తీరిన లంబోదరునికి భక్తలు భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. పెదగంజాం, సంతరావూరు, గొనసపూడి, చింతగుంపల్లి, కడవ కుదురు, పెదగంజాం, మోటుపల్లి, చినగంజాం, సోపిరాల, మున్నంవారిపాలెం, రాజుబంగారుపాలెం, కొత్తపాలెం, మూలగానివారిపాలెం, నీలాయపాలెం తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయకచవితి ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. పలు గ్రామాల్లోని విగ్రహాల వద్ద భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల్లోని విగ్రహాలను గురువారం నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించారు.
అద్దంకి : వినాయక నిమజ్జనాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. అద్దంకి పట్టణంలో ఇళ్లలో ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించిన వినాయక వి గ్రహాలను గురువారం గుండ్లకమ్మ నదిలో వంతెన పై నుంచి నిమజ్జనం చేశారు. దీంతో గుండ్లకమ్మ వంతెనపై సందడి నెలకొంది. అద్దంకి పట్టణం, మండలంలోని అన్ని గ్రామాలలో కలిపి మొత్తం 139 వినాయక వి గ్రహాలు ఏర్పాటు చేశారు. అత్యధిక శాతం వి గ్రహాలను 5వ రోజు ఆదివారం నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిమ్మాయపాలెం సమీపంలో గుండ్లకమ్మ నదిలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వీలుగా సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్ సాయంతో శుభ్రం చేయించారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. వినాయకుడి మండపాల వద్ద, నిమజ్జనం సమయంలో భక్తులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. చిన్నపిల్లలను ఒంటరిగా నిమజ్జనం వద్దకు పంపించ వద్దని తెలిపారు. తల్లిదండ్రులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సంతమాగులూరు : వినాయకచవితి సందర్భంగా మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలోని దక్షిణంబజారులోని విఘ్నేశ్వర యవత ఆధ్వర్యంలో నాలుగేళ్లగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఏర్పాటు ఏర్పాటు చసిన పంచముఖ వేఘ్నేశ్వరస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్సై పట్టాభి రామయ్య విగ్రహాన్ని పరిశీలించి మట్టివినాయకులతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.