Share News

చెరువు కట్టలు, రోడ్లకు దెబ్బ

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:13 PM

సంభవించిన మొంథా తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెరువు కట్టలు, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి.

చెరువు కట్టలు, రోడ్లకు దెబ్బ
తుఫాన్‌ కారణంగా తెగిపోయిన సోమిదేవిపల్లి దశబంధ చెరువు కట్ట సంగపేట గ్రామం వద్ద కోతకు గురైన ఆర్‌అండ్‌బీ రోడ్డు

ముంచిన మొంథా తుఫాన్‌

వృథాగా పోతున్న నీరు

ఆందోళనలో రైతులు

రాచర్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : సంభవించిన మొంథా తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెరువు కట్టలు, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. సోమిదేవిపల్లి గ్రామ సమీపంలోని దశబంధ చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా వృథాగా పోతుండడంతో కట్ట కింద పొలాలున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంగపేట సమీపంలో ని ఆర్‌ అండ్‌బి రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుములపల్లి - గౌతవరం గ్రామాల మధ్య తారు రోడ్డు దెబ్బతినడంతో వృద్దులు, పాఠశాల విద్యార్ధులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. మండలంలో వివిధ గ్రామాల్లో తారు రోడ్లు, అంతర్గత రోడ్లు కూడా తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్నాయని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. కొన్ని గ్రామాల్లో డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపై నీరు నిలిచి ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి దశబంధ చెరువు సోమిదేవిపల్లి ఆర్‌అండ్‌బి రోడ్డు మరమ్మతులకు సమస్యకు వెంటనే పరిష్కారానికి చొరవ చూపారు. అనుములపల్లి గౌతవరం గ్రామా ల్లో దెబ్బతిన్న రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో పరిష్కార చర్యలు చేపట్టలేదు.

Updated Date - Nov 04 , 2025 | 11:14 PM