తుఫాన్ నష్టం రూ.266.51కోట్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:15 AM
మొంథా తుఫాన్ జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కుండపోత వర్షం కురవడంతో వివిధ శాఖలకు రూ.266.51 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అందులో ప్రధానంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఒక్క ఆర్‌అండ్‌బీకే రూ.180.66 కోట్లు
వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో 11,144 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కుండపోత వర్షం కురవడంతో వివిధ శాఖలకు రూ.266.51 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అందులో ప్రధానంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క ఆర్‌అండ్‌బీ శాఖకే రూ.180.66 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.70.41కోట్ల మేర నష్టం జరిగింది. విద్యుత్‌శాఖకు రూ.3.36కోట్లు, నగరపాలక, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10.91 కోట్ల మేర మేర నష్టం వాటిల్లింది. మత్స్యశాఖకు రూ.88 లక్షలు, పశుసంవర్ధకశాఖకు రూ.19 లక్షలు నష్టం జరిగింది. జిల్లాలో 11,114 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వ్యవసాయశాఖ పరిధిలో 10,274 హెక్టార్లలో పలు రకాల పంటలు, ఉద్యానవన శాఖ పరిధిలో 870 హెక్టార్లలో వివిధ తోటలు ఉన్నాయి. గృహాలు 47 దెబ్బతిన్నాయి. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా ప్రాథమికంగా అంచనా వేసి కలెక్టరేట్‌కు పంపారు. కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి నివేదించారు.