Share News

రైతులకు పంట పిచికారీ డ్రోన్‌ ఎంతో మేలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:49 PM

పంట పిచికారీ డ్రోన్‌ ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో బుధవారం ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన పంట పిచికారీ డ్రోన్‌ను వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు.

రైతులకు పంట పిచికారీ డ్రోన్‌ ఎంతో మేలు
దరిమడుగు గ్రామంలో డ్రోన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కందుల

పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల

ఒక్కో డ్రోన్‌ ఖరీదు రూ.9.80లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.7.80 లక్షలు

మార్కాపురం రూరల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : పంట పిచికారీ డ్రోన్‌ ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో బుధవారం ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన పంట పిచికారీ డ్రోన్‌ను వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ పంటలకు పురుగుమందులు పిచికారీ సులభంగా, అతి తక్కువ సమయంలో చేసుకోవచ్చన్నారు. డ్రోన్‌ ద్వారా రోజుకు 25 నుంచి 30 ఎకరాల వరకు మందులను పిచికారీ చేయవచ్చునని చెప్పారు. డ్రోన్‌ ఖరీదు రూ.9.80 లక్షలు కాగా, ప్రభుత్వ రాయితీ రూ.7.80 లక్షలు ఉందని, రైతు వాటాగా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీనాయక్‌, ఏవో బుజ్జిబాయి, హెచ్‌వో రమేష్‌ పాల్గొన్నారు.

రాయితీ కూరగాయల విత్తనాల పంపిణీ

ప్రభుత్వం రాయతీపై అందిస్తున్న కూరగాయల విత్తనాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో డ్వాక్రా మహిళలకు రాయితీ కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పిచ్చయ్య, సీసీ నాగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 10:49 PM