సీపీఐ రాష్ట్ర మహాసభల ప్రచార యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:46 AM
ఒంగోలులో ఈనెల 20వతేదీ నుంచి జరగనున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార బస్సు యాత్రను మంగళవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ప్రారంభించా రు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద క ళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. అ
జిల్లాలో 16వ తేదీ వరకు నిర్వహణ
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 8 (ఆంధ్ర జ్యోతి): ఒంగోలులో ఈనెల 20వతేదీ నుంచి జరగనున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార బస్సు యాత్రను మంగళవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య ప్రారంభించా రు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద క ళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. అ నంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ ఒంగో లు నగరంలో తొలిసారిగా ఈనెల 20నుంచి 25వతేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతు న్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకు లు పాల్గొంటారన్నారు. ప్రకాశం జిల్లా సమ గ్రాభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ఏ ర్పడిన నాటి నుంచి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా ఉందన్నారు. వె లిగొండప్రాజెక్టు ప్రారంభించి 29 ఏళ్ళు దా టుతున్నా ఇంత వరకు నిర్మాణం పూర్తి చేయ కపోవడం సిగ్గుచేటన్నారు. నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక కారిడార్ వంటి హామీలు అ మలు కాక జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తుం దని, ఆయా అంశాలపై రాష్ట్ర మహాసభల్లో చ ర్చిస్తామని చెప్పారు. సీపీఐ వంద వసంతాల వేడుకల్లో భాగంగా ప్రజానాట్యమండలి ఆధ్వ ర్యంలో వెయ్యిమంది కళాకారులతో వందగొం తుకలతో, వంద కళారూపాలతో ప్రజా కళా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి ఎంఎల్.నారాయణ మాట్లాడుతూ ప్రచారజాత మంగళవారం నుంచి జిల్లాలో 16వతేదీ వరకు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, ప్రతినిధులు రామకృష్ణ, పిచ్చ య్య, ఆరేటి రామారావు, నజీర్, ఆనంతలక్ష్మి, శ్రీను, బద్రి, ఆర్.వెంకట్రావు, నల్లూరి మురళీ తదితరులు పాల్గొన్నారు.