Share News

సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:25 AM

ఒంగోలులో ఈనెల 20 నుంచి 25వతేదీ వ రకు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను వి జయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య కోరారు.

సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో ఈనెల 20 నుంచి 25వతేదీ వ రకు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను వి జయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య కోరారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ యన మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ సీపీఐ వంద వసంతాలను పురస్కరించుకొని ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, తె లంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హా జరవుతారన్నారు.

అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 24వ తేదీ వరకు ఒంగోలు కళా ఉత్సవాల పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వె య్యి మందికి పైగా కళాకారులు పాల్గొంటార న్నారు. 23న భారీ ప్రజాప్రదర్శన, బహిరంగ స భ ఉంటుందని ఆయన చెప్పారు. సీఎం చం ద్రబాబు నాయుడు ప్రకటనలు కేవలం మీడి యాకే పరిమితం అవుతున్నాయని ఆరోపించా రు. ఒంగోలు డెయిరీ పాలకుల నిర్లక్ష్యం, అవి నీతి వల్లే మూతపడిందన్నారు. ఆయా అంశా లపై రాష్ట్రమహాసభల్లో చర్చించి పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. కా ర్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ, నాయకులు ఆర్‌.వెంకట్రావు, శ్రీరామ్‌ శ్రీనివాసు లు, కొత్తకోట వెంకటేశ్వర్లు, యుగంధర్‌, రా జేంద్ర, వలరాజు, నాగభూషణం, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 06:58 AM