Share News

ఆక్రమణకు గురవుతున్న ఆవుల డొంక

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:50 AM

మండలంలోని ముక్తేశ్వరం గ్రామంలో పురా తన కాలం నుండి రైతులకు ఎంతో ఉపయెగ పడే ఆవుల డొంకను కొందరు రైతులు పంటలు సాగు చేస్తూ ఆక్రమించుకుంటు న్నారు.

ఆక్రమణకు గురవుతున్న ఆవుల డొంక

బల్లికురవ, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముక్తేశ్వరం గ్రామంలో పురా తన కాలం నుండి రైతులకు ఎంతో ఉపయెగ పడే ఆవుల డొంకను కొందరు రైతులు పంటలు సాగు చేస్తూ ఆక్రమించుకుంటు న్నారు. దీంతో డొంకకు ఎగువ భాగంలో పంట భూములు ఉన్న రైతులు ఈ డొంకలో గుండా రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముక్తేశ్వరం గ్రామంలో కొండ దిగువన ఉన్న ఆవుల డొంకకు ఇరు వైపులా సుమారు వంద ఎకరాలకు పైబడి పంట భూమి ఉంది. ఈ డొంకను కొందరు రైతులు రెండు వైపులా రోజు రోజుకు నరుకు తున్నారు. పంట భూముల్లో వ్యర్ధాలను సైతం రోడ్డునే పడేసు ్తన్నారు. దీంతో నిత్యం పంట పోలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటివల ఈడొంకను గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి పరిచారు. అయినప్పటికి డొంక భూమిని రైతులు అక్రమించుకుంటున్నారు. దిగువ భూములు ఉన్న రైతులకు ఇబ్బంది లేకపోయిన సుమారు 50 ఎకరాల పంటలు సాగు చేసే రైతులు మాత్రం ఆవుల డొంక సరిగా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబందిత అధికారులు వెంటనే స్పంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆవుల డొంకను సర్వే చేసి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:51 AM