Share News

దేవదాయ స్థలంలో కట్టడాల తొలగింపునకు కోర్టు ఆదేశం

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:26 AM

పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవ స్థానానికి చెందిన భూమి లో నిర్మించిన కట్టడాలను తొలగించాలని హైకోర్టు ఆ దేశించింది. ఈమేరకు అధి కారులు చర్యలు చేపట్టారు.

 దేవదాయ స్థలంలో కట్టడాల తొలగింపునకు కోర్టు ఆదేశం

కూలీలతో అక్కడికి చేరుకున్న అధికారులు

నిర్మాణాలు చేపట్టిన మహిళ అడ్డుకోవడంతో వెనుదిరిగిన వైనం

సింగరాయకొండ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవ స్థానానికి చెందిన భూమి లో నిర్మించిన కట్టడాలను తొలగించాలని హైకోర్టు ఆ దేశించింది. ఈమేరకు అధి కారులు చర్యలు చేపట్టారు. బుధవారం కూలీలతో కట్టడాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. ఈ సమ యంలో ఆ భూమి తనదిగా చెబుతున్న మహిళ అడ్డుకోవడంతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక కూరగాయల మార్కెట్‌ సమీపంలోని సర్వే నంబర్‌ 605-ఏలో ఉన్న 3 సెంట్ల భూమిలో రంగాని పద్మావతి కొంతకాలం క్రితం ని ర్మాణాలు చేపట్టారు. దాన్ని తాను కొనుగోలు చేసినట్లు ఆమె చెప్తున్నారు. అ యితే అది దేవదాయ శాఖకు చెందినదని, అందులో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారని స్థానికులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం వెంటనే దేవదాయ స్థలంలోని నిర్మాణాలను తొలగించాలని ఆ దేశించింది. దీంతో జిల్లా దేవదాయ అధికారి పానకాలరావు సర్వే నంబర్‌ 605 -ఏలో నిర్మాణాలను తొలగించేందుకు ఆశాఖ కందుకూరు ఇన్‌స్పెక్టర్‌ సత్యనా రాయణ, తొమ్మిది మంది ఈవోలు, ఏడుగురు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏ ర్పాటు చేశారు. వీరు వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో పి.కృష్ణవేణితో కలిసి దేవదాయ స్థలంలో ఉన్న గదులను తొలగించడానికి బుధవారం కూలీ లతో సహా అక్కడికి చేరుకున్నారు. గడ్డపారలతో కట్టడాలను తొలగించే ప్ర యత్నం చేశారు. దీంతో నిర్మాణాలను చేపట్టిన పద్మావతి అడ్డుకున్నారు. తన ను చంపి ఆతరువాత గదులను కూల్చేయాలని భీష్మించారు. అయినప్పటికీ అ ధికారులు వెనక్కు తగ్గకపోవడంతో గడ్డపారతో తలకు కొట్టుకున్నారు. తనను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో దే వదాయ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - Apr 17 , 2025 | 12:26 AM