Share News

రేపటి నుంచి మార్కాపురంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:14 PM

కాటన్‌ కార్పొరేషన్‌ తరఫున మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని ఏవో లక్ష్మీనారాయణ చెప్పారు.

రేపటి నుంచి మార్కాపురంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కేంద్రం : ఏవో లక్ష్మీనారాయణ

పెద్దారవీడు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి) : కాటన్‌ కార్పొరేషన్‌ తరఫున మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని ఏవో లక్ష్మీనారాయణ చెప్పారు. మండలంలోని శివాపురం, పుచ్చకాయలపల్లి, గొబ్బూరులలో నిల్వ ఉన్న పత్తిని సోమవారం పరిశీలించారు. క్వింటా పత్తికి రూ.8110 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 దాటకుండా ఉంటే రూ.8110 చెల్లించనున్నట్లు చెప్పారు. తేమ పెరిగిన ప్రతి ఒక్క శాతానికి రూ.81 తగ్గిస్తారన్నారు. పెద్దారవీడు మండలంలో సుమారు 8000 క్వింటాళ్ల పత్తి రైతుల వద్ద నిల్వ ఉన్నట్లు తెలిపారు. రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో బాలూనాయక్‌, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసులు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 10:14 PM