Share News

కార్పొరేషన్‌ రోడ్‌ ఆక్రమణ

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:07 AM

ఇప్పటి వరకు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, దేవుడు భూములు ఆక్రమణలకే పేరు పొందిన నగరం తాజాగా ప్రజల సౌకర్యార్థం, రాకపోకల కోసం కార్పొరేషన్‌ అధికారులు నిర్మించిన రోడ్డునూ ఆక్రమించేశారు. స్థానిక నెల్లూరు బస్టాండ్‌లోని ఓ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రోడ్‌ మార్గం నెల్లూరు బస్టాండ్‌ మెయిన్‌ రోడ్‌ నుంచి ధారావారితోటకు అనుసంధానంగా సర్వీస్‌ రోడ్‌ నిర్మించారు.

కార్పొరేషన్‌ రోడ్‌ ఆక్రమణ
ప్రజలు వెళ్లకుండా రహదారిని ఆక్రమించి బోర్డుపెట్టిన హోటల్‌ యాజమాన్యం

ఇప్పటి వరకు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, దేవుడు భూములు ఆక్రమణలకే పేరు పొందిన నగరం తాజాగా ప్రజల సౌకర్యార్థం, రాకపోకల కోసం కార్పొరేషన్‌ అధికారులు నిర్మించిన రోడ్డునూ ఆక్రమించేశారు. స్థానిక నెల్లూరు బస్టాండ్‌లోని ఓ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రోడ్‌ మార్గం నెల్లూరు బస్టాండ్‌ మెయిన్‌ రోడ్‌ నుంచి ధారావారితోటకు అనుసంధానంగా సర్వీస్‌ రోడ్‌ నిర్మించారు. అయితే ఆ రోడ్‌లో ఓ లాడ్జీని ఏర్పాటు చేసిన యాజమాన్యం ప్రజలు రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేసి, అటువైపు కనీసం కాలినడకకు కూడా అవకాశం ఇవ్వకుండా తమ స్వాధీనంలోకి తీసుకుని బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు దృష్టి సారించి, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్‌లో రాకపోకలకు అనుమతించాలని పలువురు కోరుతున్నారు.

- ఆంధ్రజ్యోతి, ఒంగోలు కార్పొరేషన్‌

Updated Date - Oct 07 , 2025 | 12:07 AM