Share News

ట్రంక్‌రోడ్‌ విస్తరణపై ఊగిసలాట..!

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:04 AM

ఒంగోలు నగర అభివృద్ధిలో భాగమైన ట్రంక్‌రోడ్‌ విస్తరణ పనులు ఒక కొలిక్కి రావ డం లేదు. గత మూడు నెలలుగా చర్చలు జరి పిన వ్యాపారులు పలు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారు.

ట్రంక్‌రోడ్‌ విస్తరణపై ఊగిసలాట..!

సమావేశాలతో వాయిదాలు వేస్తున్న వ్యాపారులు

తుది నిర్ణయం చెప్పాలంటూ తేల్చిన ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 21 (ఆంధ్ర జ్యోతి): ఒంగోలు నగర అభివృద్ధిలో భాగమైన ట్రంక్‌రోడ్‌ విస్తరణ పనులు ఒక కొలిక్కి రావ డం లేదు. గత మూడు నెలలుగా చర్చలు జరి పిన వ్యాపారులు పలు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారు. మరోవైపు విస్తరణ పనులు వేగవంతం చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. తొలుత 100 అడుగులు విస్తరించాలని భావించగా, వ్యాపారుల నుంచి అభ్యంతరం ఎదురైంది. అ ధికారుల నిర్ణయం ప్రకారం వంద అడుగులు విస్తరిస్తే సుమారు 132 మంది వ్యాపారులు నష్టపోతామని వారు తేల్చి చెప్పారు. అయితే వ్యాపారులు నష్టపోకుండా పాతమార్కెట్‌ వద్ద షాపులు నిర్మించి ఇవ్వడంతోపాటు, నాలుగు రెట్లు అధిక ధరతో టీడీఆర్‌ బాండ్‌లు కూడా ఇవ్వడానికి అధికారులు సిద్ధం అయ్యారు. దీం తో మూడు నెలలుగా విస్తరణ పనులు ఒక పట్టాన తేలకపోవడంతో విస్తరణపై నగర ప్ర జల్లో సందిగ్ధత నెలకొంది. ఒకవైపు వ్యాపారు లు 60అడుగులు అయితే తమకు ఎలాంటి అ భ్యంతరం లేదని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే రో డ్డు 40 అడుగులు ఉండగా, 60 అడుగుల చే స్తే షాపులు ముందు సైడు కాలువలు తొల గించడం తప్ప ఒరిగేదేమి లేదని అధికారులు చెబుతున్నారు. కనీసం 90 అడుగులు అయినా విస్తరించడం ద్వారా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స మస్యను తొలగించవచ్చని అధికారులు పదేప దే వ్యాపారులకు సూచిస్తున్నారు. అయితే ట్రం క్‌రోడ్‌ విస్తరణపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మూడుసార్లు వ్యాపారులతో ప్రత్యేకంగా సమా వేశాలు జరిపారు. అయినప్పటికీ వారి నుంచి భిన్నభిప్రాయబేధాలు రావడంతో ప్రతిసారీ స మావేశం వాయిదా పడటం, మరోసారి చర్చి ద్దామంటూ కాలయాపన జరుగుతోంది. ఈక్ర మంలో రెండు రోజుల క్రితం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల వ్యాపారు లతో సమావేశం అయ్యారు. ఇకపై సమావే శాలు.. చర్చలు వద్దని, అందరు మాట్లాడుకుని ఒక నిర్ణయం తేల్చి చెప్పాలని వారికి స్పష్టం చేశారు. ఈక్రమంలో ట్రంక్‌రోడ్‌కు చెందిన కో ట శ్రీమన్నారాయణ రోడ్డు విస్తరణ పనులపై అభ్యంతరం తెలియజేస్తూ హైకోర్టును ఆశ్ర యించడంతో తీర్పు పదిరోజులకు వాయిదా వేశారు. దీంతో మరోసారి ట్రంక్‌రోడ్‌ పనుల్లో జాప్యం నెలకొంది. కోర్టు తీర్పు వెలువడిన అ నంతరం న్యాయస్థానం ఆదేశాలను పరిశీలించి అందుకనుగుణంగా విస్తరణ పనులు వేగవం తం చేయడానికి అధికారులు సిద్ధం అయ్యా రు. ఇప్పటికే వ్యాపారులకు 100 అడుగుల వి స్తరణకు నోటీసులు జారీ చేసిన విషయం వి దితమే. గత మూడు నెలలుగా చోటు చేసు కున్న పరిణామాలు, అభ్యంతరాలు పరిశీలన లోకి తీసుకుంటూనే, నగర అభివృద్ధిలో భా గంగా కార్పొరేషన్‌ హోదాకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ట్రంక్‌రోడ్‌ను 80 అడు గుల మేరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 22 , 2025 | 12:04 AM