జేఎంబీ చర్చిలో మరోసారి వివాదం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:28 PM
ఒంగోలు జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి(జేఎంబీ)లో మరోసారి వివాదం చోటుచేసుకుంది. బుధవారం చర్చి ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌స(ఎ్‌సటీబీసీ) పాస్టర్స్ సమావేశాన్ని మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఎస్టీబీసీ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
పోలీసుల ఎదుటే దౌర్జన్యానికి దిగిన మరో వర్గం
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి(జేఎంబీ)లో మరోసారి వివాదం చోటుచేసుకుంది. బుధవారం చర్చి ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌స(ఎ్‌సటీబీసీ) పాస్టర్స్ సమావేశాన్ని మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్టీబీసీ ప్రతినిధి గంగవరపు భాస్కర్‌రావు నేతృత్వంలో సమావేశం జరుగుతుండగా,మరో వర్గానికి చెందిన గుర్రాల రాజ్‌విమల్, అతని స్నేహితులు అడ్డ్డుకునే ప్రయత్నం ఘర్షణకు ప్రధాన కారణంగా నిలిచింది. టూటౌన్‌పోలీసులు రంగప్రవేశం చేసి, సమావేశాన్ని ఆపివేయాలని కోరారు. తమకు పూర్తి హక్కులు ఉన్నాయని, అందుకు సంబంధించిన కోర్టు ఆదేశాలు ఉన్నాయనిగంగవరపు భాస్కర్‌రావు వెల్లడించారు. అంతేగాక క్రైస్తవ ఆస్తులు అమ్ముకునే వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మరో వర్గానికి చెందిన గుర్రాల రాజ్ విమల్ మాట్లాడుతూ ఎస్‌టీబీసీ జీసీ మెంబర్‌గా తనను ఎన్నుకున్నారని, కాగా ఈనెల 23న చర్చి ఆవరణలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసుకోగా కొందరు ఆ కార్యక్రమం జరగకుండా చేశారని ఆరోపించారు. క్రైస్తవ ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించిన వారు. అందుకు ఆధారాలు చూపించాలని సవాల్‌చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. టూటౌన్ సీఐ శ్రీనివాసరావు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. కాగా రాజ్‌విమల్ వర్గానికి చెందిన కొందరు యువకులు పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేయడంతోపాటు ఒకానొకదశలో పోలీసులపైనే తిరగబడటంతో లాఠీలకు పనికల్పించారు. కొన్నేళ్లుగా జెంఎంబీ చర్చిలో చోటుచేసుకుంటున్న వివాదాలు రోజురోజుకూ మరింత ఆజ్యం పోసుకుంటున్నాయని చర్చికి వచ్చేసే భక్తులు ఆవేదన చెందుతున్నారు.