చిట్టీల పేరుతో కానిస్టేబుల్ మోసం.. కేసు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:16 PM
చిట్టీల పేరుతో మహిళలను మోసం చేసిన కానిస్టేబుల్‌పై ఒంగోలు తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది.

ఒంగోలు క్రైం, మార్చి11(ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో మహిళలను మోసం చేసిన కానిస్టేబుల్‌పై ఒంగోలు తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్, ఆయనకు పరిచయస్తురాలైన ఓ మహిళకు ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సులుగా పనిచేస్తున్న ఇరువురు మహిళలకు పరిచయమయ్యారు. రమే్‌షకు తెలిసిన ఆ మహిళ తాను చిట్టీలు వేస్తానని చెప్పి ఇరువురు నర్సుల నుంచి డబ్బులు తీసుకుంది. రెండేళ్లు గడిచినా వారికి రావాల్సిన రూ.6లక్షలు నగదు ఇవ్వలేదు. ఇరువురు బాధితులు కలిసి కానిస్టేబుల్ రమేష్, సదరు మహిళపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు తాలుకా పోలీసులు కానిస్టేబుల్ రమేష్, చిట్టీలు వేసే మహిళను పిలిపించి విచారించగా గత డిసెంబరులోపు నగదు ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ నగదు చెల్లించకపోవడంతో తాలుకా పోలీసులకు ఇరువురు నర్సులు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ రమేష్, మరో మహిళపై కేసు నమోదు చేసినట్లు తాలుకా పోలీసులు తెలిపారు.