Share News

ఏకాగ్రతతో మానసిక ఆరోగ్యం బాగు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:50 PM

ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో ఉంటే మానసిక ఆరోగ్యం బాగుటుందని, అందరు అరోగ్యవంతులుగా ఉండవచ్చని, కెరియర్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ జి.నాగలక్ష్మీ అన్నారు.

ఏకాగ్రతతో మానసిక ఆరోగ్యం బాగు

బల్లికురవ, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో ఉంటే మానసిక ఆరోగ్యం బాగుటుందని, అందరు అరోగ్యవంతులుగా ఉండవచ్చని, కెరియర్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ జి.నాగలక్ష్మీ అన్నారు. మండలంలోని వైదన గ్రామంలో శుక్రవారం ప్రపంచ మానసిక అరోగ్య వారోత్సవాలను ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాన సిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతి విద్యార్థి చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలన్నారు. చెడు అలోచనల గురించి మరిచి పోవాలన్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో ద్యానం చేయాలన్నారు. చదువులో ఇది ఎంతో ఉపయెగ పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రమేష్‌బాబు, ప్రధానోపాద్యాయులు మారుతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాలి

మేదరమెట్ల : విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని చీరాల డివిజన్‌ డిప్యూటీ ఈవో డి.గంగాధరరావు తెలిపారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మేదరమేట్ల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాధర రావు మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఆ రోగ్య ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులు తెలియజేయా లన్నారు. కార్యక్రమంలో జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్‌ వేణుగోపాలరావు విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలిశమ్మ, హెచ్‌ఎం అంజనీదేవి, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చక్కటి స్నేహ సంబంధాలతో సమస్యలు దూరం

అద్దంకిటౌన్‌ : కుటుంబంలో, స్నేహితుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని ప్రజావైద్యశాల వైద్యులు డాక్టర్‌ యలగాల హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం సమాజంలో ప్రజలు ఎదుర్కోంటున్న మానసిక సమస్యలు-నివారణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ పిల్లల్ని సత్ప్రవర్తనతో పెంచాలన్నారు. ఒత్తిడి తగ్గించు కోవాలని, మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యన్ని కాపాడుకుంటే మానసిక సమస్యలకు దూరం గా ఉంటామన్నారు. కార్యక్రమం లో రోటరీ అధ్యక్షుడు పూర్ణ చంద్రరావు, అలహరి ప్రసాద్‌, ట్రెజరర్‌ తమ్మన శ్రీనివాసరావు, దేవపాలన, చిన్ని మురళీకృష్ణ, చప్పిడి వీ రయ్య, లేవి ప్రసాద్‌ శ్రీలక్ష్మి, శివకుమారి, భువనేశ్వరి, ఖాజావలి తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:50 PM