రాజీమార్గమే ఇరువర్గాల విజయం
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:44 PM
రాజీమార్గమే ఇరువర్గాల విజయమని కనిగిరి జూనియర్ సివిల్‌కోర్టు న్యాయాధికారి బి.రూపశ్రీ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ కారణాలతో కేసులు పెట్టుకుని విద్వేషాలతో ప్రశాంతతలేని జీవన గడపటం దుర్భరమన్నారు.
న్యాయాధికారి రూపశ్రీ
కనిగిరి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజీమార్గమే ఇరువర్గాల విజయమని కనిగిరి జూనియర్ సివిల్‌కోర్టు న్యాయాధికారి బి.రూపశ్రీ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ కారణాలతో కేసులు పెట్టుకుని విద్వేషాలతో ప్రశాంతతలేని జీవన గడపటం దుర్భరమన్నారు. ప్రతిఒక్కరూ తోటి వారితో స్నేహభావంతో మెలుగుతూ ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. జాతీయలోక్ అదాలత్‌లో 1411 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో క్రిమినల్ 103, సివిల్ 17, భరణం కేసులు 3, గృహహింస కేసులు 2, చెక్‌బౌన్స్ కేసులు 7 ఉన్నాయన్నారు. 1279 ఎస్‌టీసీ కేసులకు సంబంధించి ఇరువర్గాలమధ్య రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయసేవాధికార సంస్థ ప్యానల్, న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 192 కేసులు పరిష్కారం
దర్శి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): దర్శిలో కోర్టులో శనివారం జరిగిన లోక్‌అదాలత్‌లో 192 కేసులు పరిష్కారమయ్యాయి. సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.శివశంకరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ కేసులు 113, క్రిమినల్ కేసులు 74, ఎంసీ కేసులు 2, ప్రోనోట్ కేసు 1, ఓఎస్ కేసులు 2 పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయాధికారి కే నిఖిత, న్యాయవాదులు పాల్గొన్నారు.