కూటమి సారఽథ్యంలో సమగ్రాభివృద్ధి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:47 PM
కూటమి ప్రభుత్వ సారథ్యంలో నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక 14వ వార్డులో శుక్రవారం సాయంత్రం నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది.
మార్కాపురం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ సారథ్యంలో నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక 14వ వార్డులో శుక్రవారం సాయంత్రం నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది. ముందుగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే కందులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి మహిళలు పెద్దఎత్తున పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మౌలాలి, పఠాన్ హుసేన్‌ఖాన్, బీజేపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.