Share News

పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అంగన్‌వాడీలతో సాధ్యం

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:37 PM

గ్రామాల్లో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తోంది అంగన్వాడీ కార్యకర్తలేనని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.

పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అంగన్‌వాడీలతో సాధ్యం
అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

5జీ సెల్‌పోన్లు పంపిణీ చేసిన టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తోంది అంగన్వాడీ కార్యకర్తలేనని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ సెల్‌ఫోన్ల్లను శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్‌ కింద యాస్పిరేషన్‌ బ్లాక్‌ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం బ్లాక్‌కు గోల్డ్‌ మెడల్‌ సాధించి రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకొచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను అభినందించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 100 శాతం సంపూర్ణ పోషణ అమలు జరిగినప్పుడే అందరికీ మంచి పేరు వస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను సులువుగా అప్‌లోడ్‌ చేసేందుకు 5జీ సెల్‌ఫోన్లు బాగా ఉపయోగపడతాయన్నారు. మొత్తం 248 మందికి ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో హేమలతభాస్కర్‌ అధ్యక్షత వహించగా, ఈసభలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, తెలుగుయువత నాయకులు వేగినాటి శ్రీను, సూపర్‌ వైజర్లు పద్మజ, కేవీ సుబ్బమ్మ, బీజేపీ అధ్యక్షుడు ఎం సూర్యనారాయణ పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీలకు పరిష్కారం

ప్రజాదర్బార్‌లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరిస్తానని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. ఎర్రగొండపాలెంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు అర్జీలు స్వీకరించారు. రోడ్లు మంజూరు చేయాలని, భూములు ఆన్‌లైన్‌ చేయాలని, పింఛన్ల కోసం అర్జీలు అందజేశారు.

Updated Date - Dec 19 , 2025 | 11:37 PM