గ్రానైట్ పరిశ్రమ సమస్యలపై కమిటీ పరిశీలన
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:40 AM
గ్రానైట్ పరిశ్రమ సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. సమస్యల అధ్యయనానికి ఫ్యాక్టరీ ఓనర్లు విన్నవించుకున్న డిమాండ్లను ఫీల్డ్ లెవెల్లో పరిశీలించటానికి మైన్స్ అధికారులు సోమవారం చీమకుర్తి మండల పరిధిలోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలను పరిశీలించారు.
చీమకుర్తి,నవంబరు10(ఆంధ్రజ్యోతి): గ్రానైట్ పరిశ్రమ సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. సమస్యల అధ్యయనానికి ఫ్యాక్టరీ ఓనర్లు విన్నవించుకున్న డిమాండ్లను ఫీల్డ్ లెవెల్లో పరిశీలించటానికి మైన్స్ అధికారులు సోమవారం చీమకుర్తి మండల పరిధిలోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. యజమానులు అడిగిన ప్రధాన డిమాండ్లలో ఒకటైన కట్టర్‌కి క్యూబిక్ మీటర్‌కి ఇచ్చే అనుమతి 350 అడుగుల నుంచి 450కి పెంచమనే అంశంపై అధికారులు పరిశీలించారు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో కటింగ్ బ్లేడ్ మందంలో వచ్చిన మార్పుల మేరకు ముడిరాయినుంచి ఎక్కువ శ్లాబులు ఉత్పత్తి అవుతున్నాయని,ఈ మేరకు పరిమితి పెంచాలని మంత్రుల కమిటీ ముందు ఓనర్లు తెలిపారు. ఈ అంశం నిజమా కాధా అని ప్రత్యక్షంగా మైనింగ్ అధికారులు పరిశీలించారు.ట్రాన్సిట్ పాస్‌లను రద్దు చేయాలని మరో విన్నపాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పెరల్,కృష్ణశాయి,కేఎంబీ,ఆపిల్ గ్రానైట్ ఫ్యాక్టరీలను పరిశీలించారు.పరిశీలించిన వారిలో మైన్స్ ఏజీ రవివర్మ, టీఏలు సురే్‌షబాబు, రాజా,హరిబాబు, నాగేశ్వరరావులున్నారు.వీరి వెంట ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ నాయకులు యర్రగుంట్ల శ్రీనివాసరావు,కాట్రగడ్డ రమణయ్య,భవాని ప్రసాద్,అహ్మద్‌భాష పాల్గొన్నారు.